Siddipet: ఉపాధి బిల్లులపై లంచం డిమాండ్
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:51 AM
సిద్దిపట జిల్లా మద్దూరు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఈసీ బండకింది పర్శ రాములు లంచం తీసుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
11,500 తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఈసీ
మద్దూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మద్దూరు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఈసీ బండకింది పర్శ రాములు లంచం తీసుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మండలంలో చేసిన 213 ఉపాధి హామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ రికార్డు చేశాడు. అలా పనుల రికార్డులకు ఒక్కోదానికి రూ.200 చొప్పున సర్కారు చెల్లిస్తుంది. 213 పనుల రికార్డులకు రూ.42,500 బిల్లు వస్తుండటంతో వాటిని ప్రభుత్వామోదానికి పంపేందుకు ఈసీ పర్శరాములు రూ.11,500 లంచం అడిగాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.. వారి సూచన మేరకు మంగళవారం కార్యాలయంలోనే పర్శ రాములుకు రూ.11,500 డబ్బు చెల్లించాడు. అక్కడే మాటు వేసిన ఏసీఈ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పర్శరాములును పట్టుకున్నారు.
పారామెడికల్ ప్రమోషన్స్ అంటేచిన్నచూపు: జేఏసీ
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సంచాలకుల పరిధిలోని పారామెడికల్ ఉద్యోగుల పదోన్నతులను ఆపడం ఆనవాయితీగా మారిందని పారామెడికల్ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్య విద్య డైరక్టర్(డీఎంఈ) పరిధిలో డైటీషియన్, బయోకెమిస్ట్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పదోన్నతులు చేపట్టడం లేదని మండిపడింది. ఏటా పదోన్నతుల ప్యానెల్ ఇయర్ ముగిసే వరకు కాలయాపన చేస్తూ, చివరి నిమిషంలో ప్రభుత్వానికి రాయడం ఒక తంతుగా మారిందని పేర్కొంది. డీఎంఈ పరిధిలోని అధ్యాపకులు, పరిపాలన విభాగపు ఉద్యోగులకు మాత్రం ఠంచనుగా పదోన్నతులు ఇచ్చేస్తున్నారని, తమ పదోన్నతుల విషయంలో మాత్రం ఎక్కడా లేని వివక్ష చూపుతున్నారని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..