Seethakka: 2204 మంది అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు
ABN , Publish Date - May 18 , 2025 | 04:04 AM
అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పిల్లలకు ఆమె భరోసా ఇచ్చారు.
అనాథ చిన్నారులకు సర్కారు అండగా ఉంటుంది: సీతక్క
95కి పైగా ఆస్పత్రుల్లో 180 పైగా చికిత్సలు: పొన్నం
హైదరాబాద్ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పిల్లలకు ఆమె భరోసా ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని చైల్డ్‌కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ (సీసీఐ)లో ఉంటున్న 2204 మంది అనాథ పిల్లలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శనివారం మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులు పంపిణీ చేశారు.
దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ జిల్లాలో 2204మందికి అనాథ, నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశామని, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనాథ చిన్నారులందరికీ కార్డులను అందిస్తామని సీతక్క చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా గుర్తింపు పొందిన 95కి పైగా ఆస్పత్రుల్లో 180కి పైగా వైద్య చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం అనాథలతో కలిసి మంత్రులు సహపంక్తి భోజనం చేశారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News