Special Trains: సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:05 AM
సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో...
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 6 నుంచి 18వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జనవరి 6, 7 తేదీల్లో చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి (07077/07078), 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి (02764/02763) మధ్య 6 రైళ్లు అందుబాటులో ఉంటాయి.
13న వికారాబాద్-కాకినాడ టౌన్ (07037), 14న కాకినాడ టౌన్-చర్లపల్లి (07038) మధ్య రైళ్లు నడుస్తాయి. 9, 10, 16, 17 తేదీల్లో కాచిగూడ-తిరుపతి-కాచిగూడ మధ్య నాలుగు, 11, 12, 18, 19 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి (07035/07036) మధ్య నాలుగు, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య నాలుగు, జనవరి 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి (07033/07034)మధ్య పది రైళ్లు నడుస్తాయి. 8, 9, 10, 11, 12, 13, 14, 15 చర్లపల్లి-కాకినాడ టౌన్-చర్లపల్లి (07031/07032)మధ్య ఎనిమిది, జనవరి 6, 7, 13, 14 తేదీల్లో నాందేడ్-కాకినాడ టౌన్-నాందేడ్ (07487/07488) మధ్య నాలుగు, జనవరి 9, 10, 12, 13, 14, 15 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి (07025/ 07026) మధ్య ఆరు రైళ్లు అందుబాటులో ఉంటాయి. 7, 8 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం రోడ్-కాచిగూడ (07041/07042)మధ్య రెండు రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.