Share News

SC ST Commission Chairman Visits Girl Sahasra Parents : కూకట్‌పల్లిలోని సహస్ర ఇంటికి ఎస్సీ, ఎస్టీ కమిషన్

ABN , Publish Date - Aug 23 , 2025 | 07:07 PM

హత్యకు గురైన కూకట్‌పల్లిలోని సహస్ర తల్లిదండ్రుల్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పరామర్శించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తామని..

SC ST Commission Chairman Visits Girl Sahasra Parents : కూకట్‌పల్లిలోని సహస్ర ఇంటికి ఎస్సీ, ఎస్టీ కమిషన్
SC ST Commission Chairman Visits Girl Sahasra Parents

హైదరాబాద్, ఆగస్టు 23 : నిన్న హత్యకు గురైన కూకట్‌పల్లిలోని సహస్ర ఇంటికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ వచ్చింది. ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సీఎంతో మాట్లాడి బాలిక కుటుంబ సభ్యులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు.


ఇలాఉండగా, ఈ ఉదయం హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పీఎస్ ఎదుట కూకట్‌పల్లిలో హత్యకు గురైన సహస్ర పేరెంట్స్, బంధువులు బైఠాయించారు. అసలైన దోషులను తప్పించారంటూ ఆరోపించారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సహస్రని తల్లి రేణుక స్టేషన్ ఎదుట గుండెలవిసేలా రోధించారు. 'నా కూతుర్ని హత్య చేసినట్లు ఆ అబ్బాయిని హత్య చేయాలి. నా మీద, నా భర్త మీద ఎన్నో ఆరోపణలు చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మేము చంపుకున్నామని నా మీద విమర్శలు చేశారు. నా కొడుకు ఆలోచన తీరు మారింది. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణానికి ఒడిగడతాడా. మొబైల్ తీసుకొచ్చినప్పుడే తల్లిదండ్రులు పరిశీలించి ఉంటే ఈ రోజు నా కూతురికిలా అయ్యేది కాదు. అక్కను చంపిన వాడిని నేను చంపుతాను అంటూ నా కొడుకు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మైనర్ అబ్బాయి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. మాకు న్యాయం జరగాలి.. నిందితుడిని మా ముందుకు తీసుకురావాలి.' అని సహస్రని తల్లి వాపోయింది.

ఇలా ఉంటే, సహస్ర తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. 'క్రికెట్ బ్యాట్ కోసం కాదు, ఇంట్లోని డబ్బు కోసమే బాలుడు వచ్చాడు. సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది. న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనుమానం ఉంది. పోలీసులు మరోసారి దర్యాప్తు చేయాలి' అని సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 07:11 PM