Hostel Incident: ప్రభుత్వ కాలేజీ హాస్టల్‌ అన్నం గిన్నెలో కాలుపెట్టిన వర్కర్.. షాకింగ్ వీడియో

ABN, Publish Date - Nov 13 , 2025 | 10:05 PM

ప్రభుత్వ వ్యవస్థల మీదే సందేహాలు రేకెత్తించే ఘటన ఇది. ప్రభుత్వ హాస్టల్ కిచెన్‌లో విద్యార్థులకు వడ్డించే అన్నంగిన్నెలో కాలు పెట్టి పడుకున్నాడు ఓ వర్కర్. మద్యం మత్తులో తాను ఏంచేస్తున్నాడో కూడా తెలీకుండా జోగుతూ..

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్‌లో గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మద్యం మత్తులో ఉన్న వర్కర్ నరేష్, మత్తులో తూగుతూ విద్యార్థుల భోజనానికి వడ్డించే అన్నంలో కాలిపాదాలు పెట్టాడు. కిచెన్‌లోనే పడుకుండిపోయాడు.


ఇది చూసిన కాలేజ్ విద్యార్థులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. అతన్ని నిద్ర లేపినా లేవలేదు. దీంతో ఈ ఉదంతాన్ని మొబైల్‌లలో వీడియోలు రికార్డ్ చేసి, అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ నరేష్ మీద విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే, ఈ ఘటన మీద స్పందించిన అధికారులు నరేష్‌ను డ్యూటీ నుంచి తొలగించారు.


ఇవీ చదవండి:

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated at - Nov 13 , 2025 | 10:08 PM