Share News

RTC buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు పది నిమిషాలకో బస్సు

ABN , Publish Date - Apr 19 , 2025 | 07:39 AM

చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి 10 నిమిషాలకో బస్సు నడిచేలా ఏర్పట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చర్లపల్లిలో కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడినుంచే కొన్ని రైళ్ళ రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఇతర ఏరియాలకు పది నిమిషాలకో బస్సును ఏర్పాటు చేశారు.

RTC buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు పది నిమిషాలకో బస్సు

హైదరాబాద్‌ సిటీ: చర్లపల్లి రైల్వేస్టేషన్‌(Cherlapalli Railway Station) నుంచి సికింద్రాబాద్‌కు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్లరాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారుల సహకారంతో రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: గ్రేటర్‌ నేతలతో నేడు కేటీఆర్‌ సమావేశం


చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మెహిదీపట్నం, బోరబండ, కోఠి, అఫ్జల్‌గంజ్‌(Secunderabad, Uppal, Mehidipatnam, Borabanda, Kothi, Afzalganj) ప్రాంతాలకు నడుపుతున్న బస్సులతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు పెంచే దిశగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చర్లపల్లి నుంచి తెల్లవారు జామున 4.20 నుంచి రాత్రి 10.5 గంటల వరకు పది నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉందన్నారు.

city2.2.jpg


రైళ్ల సమయపాలన బట్టి మరిన్ని బస్సులు

చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 88 సర్వీసులు నడుపుతున్నాం. రైళ్ల సమయపాలన బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్టేషన్‌లో రైల్వే అధికారులతో సమన్వయం కోసం సూపర్‌వైజర్లను నియమించాం.

- జీఎన్‌ పవిత్ర, సికింద్రాబాద్‌ డిప్యూటీ ఆర్‌ఎం ఆపరేషన్‌


ఈ వార్తలు కూడా చదవండి

బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం

ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి

మాటల్లో కాదు చేతల్లో చూపండి

కీర్తి సురేష్ క్యూట్‏గా...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2025 | 07:39 AM