RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.5% పెంపు
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:27 AM
ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2.5% డీఏ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
నేటి నుంచే అమల్లోకి మహిళా శక్తి బస్సుల ప్రారంభం కూడా నేడే
తొలి దశలో 150 బస్సులు.. మొత్తం 600
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2.5% డీఏ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ప్రతినెలా రూ.3.6కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అంతేకాకుండా, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా మహిళా దినోత్సవం రోజు ‘మహిళా శక్తి’ బస్సులను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి బస్సు పథకంలో భాగంగా.. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా బస్సులను కొనిపించి, వాటిని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో నడిపిస్తూ.. మహిళా సంఘాలకు అద్దె చెల్లించనున్నారు. బస్సుల కొనుగోలుకు ప్రభుత్వమే రుణాలు సమకూరుస్తుంది.
మొత్తం 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనిపించి, ఆర్టీసీలో నడిపించేలా ఒప్పందం జరిగినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తొలిదశలో శనివారం 150 బస్సులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ బస్సులను సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. శనివారం 150 మండలాల్లో.. ఒక్కో మండలంలో ఒక్కో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 150కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇలా వారికి రూ.5వేల కోట్ల ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News