Moosi River Development: మూసీ అభివృద్ధికి రూ.375 కోట్లు
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:49 AM
మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేసింది..
ఎంఆర్‌డీసీఎల్‌కు రెండో త్రైమాసికం నిధులు
విడుదల చేస్తూ పురపాలక శాఖ జీవో
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేసింది. నది అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్)’కు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధుల్లో రెండో విడత కింద రూ.375 కోట్లు విడుదల చేస్తూ శనివారం పురపాలక శాఖ జీవో జారీ చేసింది. మూసీ నది అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించింది. తొలి త్రైమాసికంలో రూ.375 కోట్లను విడుదల చేసింది. రెండో త్రైమాసికానికి సంబంధించి తాజాగా మరో రూ.375 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.750 కోట్లు విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News