Share News

Ramchander Rao: బీసీ రిజర్వేషన్‌పై జీవో ఎందుకివ్వరు?

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:36 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై జీవో ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ జీవోకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

Ramchander Rao: బీసీ రిజర్వేషన్‌పై జీవో ఎందుకివ్వరు?

  • రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశం కాంగ్రె్‌సకు లేదు

  • అందుకే బీజేపీపై నెపం: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై జీవో ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ జీవోకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్‌పై నెల కిందట తాను చేసిన సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ చేసిందని చెప్పారు. చట్ట సవరణ చేయకుంటే రిజర్వేషన్‌ సాధ్యం కాదని తాను చెప్పానని.. ఆ మాట కాంగ్రెస్‌ నాయకులకు అర్థంగాక, తాను బీసీలకు వ్యతిరేకమని ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్‌ ఇవ్వాలన్న ఉద్దేశం కాంగ్రె్‌సకు ఉంటే న్యాయపరమైన ప్రక్రియలోనే చిత్తశుద్ధి కనబరిచేదని అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బీసీ సమాజాన్ని కాంగ్రెస్‌ మోసం చేస్తోందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీలు డిమాండ్‌ చేస్తుంటే.. కాంగ్రెస్‌ తమపై రాళ్లు వేస్తోందని ఆరోపించారు.


బీసీ డిక్లరేషన్‌ అమలు చేసిన రోజే కాంగ్రె్‌సకు కామారెడ్డి గడ్డపై మాట్లాడే అధికారముందని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ కాదు.. అది బీసీలకు ద్రోహం.. అని మండిపడ్డారు. ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం చేతగాదని మీరు చెప్పండి. మేం అధికారంలోకి రాగానే ఇస్తాం. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ చేశారు. బిల్లును గవర్నర్‌కు పంపించారు. కేంద్రంగానీ, బీజేపీగానీ ఎక్కడ అడ్డుకుంది..?’ అని ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.3వేల కోట్లు నిలిచిపోయాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. తమ పార్టీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించాలన్న కాంగ్రెస్‌.. తాను మాత్రం రెడ్డి సామాజికవర్గం అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. రెండేళ్లలో బీసీలకు ఏం న్యాయంచేశారని కాంగ్రె్‌సను రాంచందర్‌రావు నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్

ఆలయాల అభివృ‌ద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

For More TG News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:36 AM