Share News

Raja Sing: డీజీపీకి రాజాసింగ్ లేఖ.. కేసులు ఎలా పెడతారని ప్రశ్న?

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:33 PM

అక్రమ కేసులను నమోదు చేయడానికి గల కారణం ఏంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ హిందూ సభలో తాను మాట్లాడిన మాటలను పోలీసులు వక్రీకరించి కేసు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. హైరాదాబాద్ సిటీకి సంబంధం లేకుండా కేసు ఎలా పెడతారని లేఖలో ప్రశ్నించారు.

Raja Sing: డీజీపీకి రాజాసింగ్ లేఖ.. కేసులు ఎలా పెడతారని ప్రశ్న?
Raja Sing

హైదరాబాద్, అక్టోబర్ 11: హైదరాబాద్‌లో తన మీద పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బయటపెట్టారు. అక్రమ కేసులను నమోదు చేయడానికి గల కారణం ఏంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఓ హిందూ సభలో తాను మాట్లాడిన మాటలను పోలీసులు వక్రీకరించి కేసు నమోదు చేసారని ఫిర్యాదు చేశారు. హైరాదాబాద్ సిటీకి సంబంధం లేకుండా కేసు ఎలా పెడతారని లేఖలో ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. రాజాసింగ్ ఫిర్యాదుపై రాష్ట్ర పోలీసులు తీసుకునే యాక్షన్‌పై ఉత్కంఠ నెలకొంది.


రాజాసింగ్‌పై నమోదైన పోలీస్ స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్, కాలా పత్తర్, నాంపల్లి, శాలిబండ, సంతోష్ నగర్, భవానీ నగర్, కామాటిపుర, హబీబ్ నగర్, అంబర్‌పేట్, బోరబొండ, హుస్సేనీ ఆలం, మాదన్నపేట, గోల్కొండ, ఫలక్‌నుమా, అత్తాపూర్, కుల్సుంపుర, పహాడీ షరీఫ్, నాంపల్లి, గుడి మల్కాపూర్, బేగంపేట, తలాబ్ కట్ట, బేగం బజార్, చంద్రాయణగుట్ట, మదనపేట పోలీస్ స్టేషన్ 2వ ఫిర్యాదు, బస్వకళ్యాణ్ కర్ణాటక పోలీస్ స్టేషన్, మలక్‌పేట, తాండూర్, బీదర్ కర్ణాటక, ముషీరాబాద్, బంజారాహిల్స్, బహదూర్‌పుర.. ఇలా మొత్తం 31 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

TGS local Body Polls: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వండి.. రేవంత్ సర్కారుకి SEC లేఖ

MP Raghunandan Rao: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు ఓటేస్తే.. మూసీలో వేసినట్లే

Updated Date - Oct 11 , 2025 | 04:45 PM