Share News

TGS local Body Polls: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వండి.. రేవంత్ సర్కారుకి SEC లేఖ

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:54 AM

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలి కోర్టు తీర్పు నేపథ్యంలో..

TGS local Body Polls: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వండి.. రేవంత్ సర్కారుకి SEC లేఖ
TGS local Body Polls

హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలి కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ కోరింది.తదననుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని వెల్లడించింది.


తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపలేదని కూడా ఈసీ తన లేఖలో వెల్లడించింది. ఇలా ఉండగా ఈ అంశానికి సంబంధించి కాసేపట్లో ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.


ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాల్సిన అవసరం ఉందో లేదో, లేదా తదుపరి చర్యలు ఏమిటో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. దీని ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 12:01 PM