Share News

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:06 AM

కిషన్‌రెడ్డి గారూ.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టతను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

మిమ్మల్ని కలిసి మా సమస్యలు వివరిస్తాం.. నేను పార్టీ సహచరులతో కలిసి వస్తా

  • నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని.. విడదీసి, అడ్డంకులు సృష్టిస్తున్నారు

  • ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా?

  • వ్యక్తిగత విభేదాలను పక్కనపెడుదాం

  • అందరం ఐక్యంగా కలిసి పనిచేద్దాం

  • గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందన

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ‘‘కిషన్‌రెడ్డి గారూ.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టతను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్ణయిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము విభజించడానికి కాదు.. ఐక్యతను తీసుకురావడానికి ఇక్కడ ఉన్నాం’’ అని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. తనపై కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్‌ స్పందించారు. ఈ మేరకు మంగళవారం రాజాసింగ్‌ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రాజాసింగ్‌ ఏమి చెబితే దాన్ని మేము పాటిస్తామని మీరు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మీకు విన్నవించుకుంటున్నాను. అందరికీ తగిన గౌరవాన్ని ఇస్తూ, ఈ విషయంపై నేను నేరుగా స్పందించాలనుకుంటున్నా. పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుపడాలి.


తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి. నేనెప్పుడూ వ్యక్తిగత లబ్ధి లేదా పదవుల కోసం పని చేయలేదు. నా కృషి ఎప్పుడూ పార్టీని బలోపేతం చేయడంపైనే ఉంటుంది. నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని, నన్ను విడదీసి, అడ్డంకులు సృష్టించడం జరుగుతోంది. అయినప్పటికీ నేను పార్టీకి అంకితమైన, నిస్వార్థ సేవ చేస్తున్నా. ఒక ప్రశ్న వేస్తున్నాను.. ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? దయచేసి ఆలోచించండి. ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం? ఈ రోజు, నేను నా కోసం కాకుండా.. పార్టీ ఐక్యత కోసం పనిచేస్తున్న లక్షలాది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నాను. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు. విభేదాలను విడిచిపెట్టి, ఐక్యంగా కలిసి పనిచేద్దాం’’ అని రాజాసింగ్‌ కోరారు.


ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం

‘ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ రోగులకు చికిత్స పొందుందేకు ఉండాల్సిన అనువైన పరిస్థితులు లేవు’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డులు, మార్చురీ, అవుట్‌పేషంట్ల విభాగాన్ని పరిశీలించారు. మార్చురీ వద్ద పరిస్థితి ఘోరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 05:06 AM