Rahul Gandhi: రాహుల్ స్ఫూర్తితోనే కుల గణన
ABN , Publish Date - May 27 , 2025 | 03:51 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తి, భారత్ జోడో యాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కుల గణనను విజయవంతంగా నిర్వహించామని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
తెలంగాణలో పారదర్శకంగా నిర్వహించాం
టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశం
న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తి, భారత్ జోడో యాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కుల గణనను విజయవంతంగా నిర్వహించామని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్(ఐఐసీ)లో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తాజా, మాజీ పీసీసీ అధ్యక్షులు, బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. తెలంగాణ నుంచి మహేశ్ కుమార్‌తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీసీ నేతలు వీహెచ్, మధుయాష్కి గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మొత్తం మూడు సెషన్లులో సమావేశాలు నిర్వహించారు. తొలుత.. రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహించాలని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కేంద్రం కుల గణన ప్రకటన చేసిందన్నారు. కుల గణనతోనే ఓబీసీలకు సముచిత స్థానం లభిస్తుందని, విద్య, ఉద్యోగం, రాజకీయం.. ఇలా అన్నింటా న్యాయం జరుగుతుందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వీహెచ్, ఆది శ్రీనివాస్ మీడియాతో మట్లాడారు. కాంగ్రెస్ ఓబీసీ సమావేశం వివరాలను వెల్లడించారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..