Share News

Traffic Rules Rachakonda Police: హైటెక్‌ ట్రాఫిక్‌ పోలీస్‌!

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:57 AM

ట్రాఫి క్‌ రూల్స్‌ను పట్టించుకోకుండా రోడ్ల మీద ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ.. నిబంధనలను యదేచ్చగా ఉల్లంఘించే ఆకతాయిలకు అడ్డుకట్ట వేసే ప్రత్యేక కార్యక్రమానికిసిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శ్రీకారం చుట్టారు.

Traffic Rules Rachakonda Police: హైటెక్‌ ట్రాఫిక్‌ పోలీస్‌!

  • మైక్రో ఫోన్‌, డ్యాష్‌ బోర్డు కెమెరా, జీపీఎస్‌ ట్రాకర్‌తో పెట్రోలింగ్‌

  • బైక్‌ దిగకుండానే ఉల్లంఘనలను రికార్డు చేసి చలానాలు

  • హైదరాబాద్‌లో వినూత్న ప్రయోగం

  • 50 బైక్‌లను ప్రారంభించిన సీపీ

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ట్రాఫి క్‌ రూల్స్‌ను పట్టించుకోకుండా రోడ్ల మీద ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ.. నిబంధనలను యదేచ్చగా ఉల్లంఘించే ఆకతాయిలకు అడ్డుకట్ట వేసే ప్రత్యేక కార్యక్రమానికిసిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్‌ పోలీసులు బండి మీద నుంచి కిందకి దిగకుండానే.. ట్రాఫిక్‌ ఉల్లంఘనలను నేరుగా రికార్డు చేసి, చలానాలు విధించేందుకు వీలుగా సెక్యూరిటీ కౌన్సిల్‌-సిటీ పోలీస్‌ సంయుక్త భాగస్వామ్యంతో 50 ట్రాఫిక్‌ గస్తీ వాహనాలను (అవెంజర్‌ క్రూయిజ్‌ 220) రంగంలోకి దింపారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)లో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాహనాలను సీపీ సీవీ ఆనంద్‌ జెండావూపి ప్రారంబించారు. రాబోయే రోజుల్లో.. ట్రాఫిక్‌ను ఉల్లంఘించిన వాహనాలను ఏఐ ను వినియోగించి గుర్తించడంతో పాటు.. ఆ వాహనంపై ఉన్న పెండింగ్‌ చలానాలు చూపిస్తూ.. ఆటోమేటిగ్గా కొత్త చలానా జనరేట్‌ అయ్యే విధంగా టెక్నాలజీని వినియోగించనున్నట్లు సీపీ వెల్లడించారు. అలాగే.. పెండింగ్‌ చలానాలు ఎక్కువగా ఉన్న వాహనాలను గుర్తించి, వాటిని నడిపేవారిని తరచూ ఉల్లంఘనలకు పాల్పడేవారిగా గుర్తించి.. చలానాలు వసూలు చేస్తామని ఆయన చెప్పారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన 50 మంది ట్రాఫిక్‌ పోలీసులకు ఆ వాహనాలను కేటాయించారు. ఆ వాహనాలతోపాటు.. ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల దుస్తులకు కూడా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను అమర్చారు. అవేంటంటే..


పీఏ సిస్టమ్‌.. బాడీవోన్‌ కెమెరా

ఈ మైక్రో ఫోన్‌ను కానిస్టేబుల్‌ కాలర్‌కు అమర్చుతారు. పెట్రోలింగ్‌ చేస్తున్న క్రమంలో ఎక్కడైనా రాంగ్‌ పార్కింగ్‌ వాహనాలు కనిపించినా, రోడ్డుకు అడ్డంగా ఏదైనా వాహనం ఆగినా, ఎవరైనా ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతున్నట్లు అనిపించినా.. ట్రాఫిక్‌ పోలీస్‌ తన వాహనానికి అమర్చిన పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఆ వాహనాన్ని తొలగించాల్సిందిగా ఆదేశిస్తాడు. పోలీసులు చెప్పిన వెంటనే వాహనదారుడు తన వాహనాన్ని అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసుల పట్ల కొంతమంది పోకిరీలు, ఆకతాయిలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కానిస్టేబుల్‌ డ్రస్‌కు అమర్చిన బాడీవోన్‌ కెమెరా.. ఎదుటి వ్యక్తి మాట్లాడే అన్ని విషయాలనూ క్యాప్చర్‌ చేస్తుంది. వీడియో రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఫైల్‌ చేస్తారు. బాడీవోన్‌ కెమెరాలో రికార్డయిన వీడియోలను సాక్ష్యంగా చూపించి నిందితులను కోర్టుబోనులో నిలబెడతారు.

యూహెచ్‌ఎ్‌ఫ హ్యాండ్‌హెల్డ్‌ సెట్‌..

రోడ్డుపై పెట్రోలింగ్‌ చేస్తున్న క్రమంలో ఎక్కడైనా ఎక్కువగా ట్రాఫిక్‌ జామ్‌ అయినా, ఇతర ట్రాఫిక్‌ ఇబ్బందులున్నా.. కానిస్టేబుల్స్‌ తమ వద్ద ఉన్న యూహెచ్‌ఎ్‌ఫ హ్యాండ్‌ హెల్డ్‌ సెట్‌ ద్వారా ఆ వివరాలను ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలుపుతారు. దీంతో ఆ పరిధిలోని ట్రాఫిక్‌ సిబ్బంది, అధికారులు అప్రమత్తమై సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు. ఇక ఎక్కడైనా ట్రాఫిక్‌ జామ్‌ అయినప్పుడు.. సిగ్నల్స్‌ లేని ప్రాంతంలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరిస్తున్నప్పుడు ఎల్‌ఈడీ బ్యాటన్‌ను రెడ్‌, గ్రీన్‌ సిగ్నల్స్‌ ఇవ్వడానికి చూపుతారు.


డ్యాష్‌బోర్డు కెమెరా.. వీల్‌క్లాంప్‌

డ్యాష్‌బోర్డు కెమెరాను ట్రాఫిక్‌ పోలీస్‌ భుజానికి అమర్చుతారు. వాహనదారులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినా, రాంగ్‌రూట్లో వస్తున్నా ఈ కెమెరా ఆ వాహనాలను క్యాప్చర్‌ చేస్తుంది. ఆ వాహనాలకు వెంటనే చలానా వేస్తారు.. ట్రాఫిక్‌ పెట్రోలింగ్‌ వాహనాలు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి.. సిబ్బంది పనితీరు ఎలా ఉంది తెలుసుకోవడానికి, వాహనాల పర్యవేక్షణకు జీపీఎస్‌ సిస్టంను వాహనానికి అమర్చినట్లు సీపీ తెలిపారు. ఇటు రోడ్డుమీద ఎక్కడైనా వాహనం అనధికారికంగా పార్కింగ్‌ చేస్తే ఆ వాహనానికి వీల్‌క్లాంప్‌ వేసి ట్రాఫిక్‌ క్రేన్‌ వాహనంలో తరలిస్తారు.

ప్రథమచికిత్స కిట్‌.. రెయిన్‌ కోట్లు, బూట్లు

ట్రాిఫిక్‌ పెట్రోలింగ్‌ వాహనంలో ప్రథమ చికిత్స కిట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. రోడ్డుపై ఏదై నా ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉన్న పెట్రోలింగ్‌ వాహనం ఘటనా స్థలానికి చేరుకుంటుంది. క్షతగాత్రులకు ఈ కిట్‌తో ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలిస్తారు. అలాగే వాన వచ్చినప్పుడు ట్రాఫిక్‌ సిబ్బంది ధరించడానికి రెయిన్‌ కోట్లు, బూట్లు, ఇతర పరికరాలను వాహనంలో సిద్ధంగా ఉంచుతారు. వర్షం మొదలవుతుందని తెలియగానే వాటర్‌ లాగింగ్‌, ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే ప్రాంతాలకువెళ్లిపోతారు. ఇక ట్యాబ్‌ ద్వారా పెండింగ్‌ చలానాలు చెక్‌ చేసి చలానాలు కట్టించడం, కొత్త చలానాలు వేయడం వంటి విధులను నిర్వహిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 04:57 AM