R. Krishnaiah: ఎస్సీ హాస్టళ్ల మెస్ బిల్లులు విడుదల చేయాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:31 AM
రాష్ట్రంలో ఎస్సీ హాస్టళ్ల మెస్ బిల్లులు రూ. వంద కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 16 నెలలుగా ఎస్సీ హాస్టళ్ల మెస్ బిల్లులు, కూరగాయల బిల్లులు, నిత్యావసర వస్తువుల బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని, దీంతో హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.
- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ హాస్టళ్ల మెస్ బిల్లులు రూ. వంద కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. 16 నెలలుగా ఎస్సీ హాస్టళ్ల మెస్ బిల్లులు, కూరగాయల బిల్లులు, నిత్యావసర వస్తువుల బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని, దీంతో హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.

శుక్రవారం బషీర్‌బాగ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రసిడెంట్ నీలావెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎస్సీ హాస్టల్స్ మెస్ బిల్లులు విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News