Share News

R. Krishnaiah: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:53 AM

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల బర్తీకి వెంటనే నోటీఫికేషన్‌లు జారీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం బర్కత్‌పురలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

R. Krishnaiah: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి

- రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల బర్తీకి వెంటనే నోటీఫికేషన్‌లు జారీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. బుధవారం బర్కత్‌పురలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ... గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అపీల్‌కు వెళ్లకుండా గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, పలు బీసీ సంఘాల నేతలు సి.రాజేందర్‌, మణికంఠ, నిఖిల్‌, సి.రాహుల్‌, రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8000 కోట్లు విడుదల చేయాలి

బర్కత్‌పుర: రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.8వేల కోట్లును విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నీలా వెంకటేష్‌, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు పగిళ్ళ సతీష్‌ ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.


city1.2.jpg

ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దసరా సెలవులు ముగిసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని, ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు మోదీ రాందేవ్‌, లింగయ్య, రవి, కౌశిక్‌, మణికంఠ, నిఖిల్‌, లీలావతి, శివ, సంపత్‌, నరేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 18 , 2025 | 06:57 AM