R. Krishnaiah: అశోక్‌కుమార్ దీక్ష విరమణ కాదు.. ఆరంభమే
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:56 AM
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 2 లక్షల నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 13రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు.
- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 2 లక్షల నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 13రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉస్మానియా ఆస్పత్రిలో కిత్స పొందుతున్న అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ కుమార్‌ను శుక్రవారం ఆర్.కృష్ణయ్య, బీసీ నేత గుజ్జ కృష్ణ, నిరుద్యోగి అస్మాబేగంతో పాటు పలువురు నిరుద్యోగ అభ్యర్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు.

అనంతరం కొబ్బరినీళ్ళు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈసందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కొత్తగా గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సం ఘాల ప్రతినిధులు చిరంజీవులు, నీల వెంకట్, చెరుకు మణికంఠ, రాజు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News