Share News

Hyderabad: సూరత్‌ టు హైదరాబాద్‌..1,300 కి.మీ. 16 గంటల ప్రయాణం

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:21 AM

1,300 కి.మీ దూరం.. రోడ్డు మార్గం ద్వారా 16 గంటల ప్రయాణం.. అయినా మొక్కవోని ధైర్యంతో నెలలు నిండని ఓ శిశువును అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించి వైద్యులు అతని ప్రాణాలు కాపాడారు.

Hyderabad: సూరత్‌ టు హైదరాబాద్‌..1,300 కి.మీ. 16 గంటల ప్రయాణం

- నగరానికి నవజాత శిశువు తరలింపు

- ఆరోగ్య సమస్యలతో నెలలు నిండని శిశువు జననం

- రెండు అంబులెన్స్‌లు, 31మంది వైద్య సిబ్బంది..

- దారి పొడవునా వైద్యం అందిస్తూ హైదరాబాద్‌కు..

- రెండు నెలల పాటు కిమ్స్‌ కడల్స్‌లో చికిత్స

- కోలుకున్న బాబు డిశ్చార్జీ

హైదరాబాద్‌ సిటీ: 1,300 కి.మీ దూరం.. రోడ్డు మార్గం ద్వారా 16 గంటల ప్రయాణం.. అయినా మొక్కవోని ధైర్యంతో నెలలు నిండని ఓ శిశువును అంబులెన్సులో హైదరాబాద్‌(Hyderabad)కు తరలించి వైద్యులు అతని ప్రాణాలు కాపాడారు. రెండు అంబులెన్సులు, 31 మంది వైద్య సిబ్బంది క్షణ క్షణం ఓ యుగంలా గడుపుతూ గుజరాత్‌లోని సూరత్‌(Surat) నుంచి నగరానికి ఆ నవజాత శిశువును తరలించి క్రెడల్‌ ఆస్పత్రిలో చికిత్సనందించి ప్రాణం పోశారు.


కిమ్స్‌ కడల్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను క్లినికల్‌ డైరెక్టర్‌, చీఫ్‌ నియో నాటాలజిస్ట్‌ డాక్టర్‌ బాబు ఎస్‌. మదార్కర్‌ వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన సుదీప్త రంజన్‌ స్వైన్‌, సంధ్య స్వైన్‌ దంపతులకు శిశువు జన్మించాడు. శిశువు 1.1 కిలోల బరువుతో ఏడో నెలలోనే జన్మించడంతో తీవ్రమైన సెప్సిస్‌, ఊపిరి అందకపోవడం, పలు అవయవాలు పనిచేయకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.


city3.jfif

ఎయిర్‌ అంబులెన్సు ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. ఒక అంబులెన్స్‌లో శిశువును, మరో అంబులెన్సులో ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేసి, మార్గమధ్యలో వాటిని మార్చుకుంటూ శిశువుకు వైద్యం అందిస్తూ హైదరాబాద్‌కు తరలించారు. 15మంది వైద్యులు, నర్సులు, బయోమెడికల్‌ సిబ్బంది, మార్కెటింగ్‌ సిబ్బంది, 11 మంది బ్యాకెండ్‌ నిపుణులు, ఐదుగురు పరోక్ష సహాయ సిబ్బంది మొత్తం మూడు విభాగాలుగా ఏర్పడి శిశువును కాపాడడంలో కృషి చేసినట్లు వివరించారు.


క్రెడల్‌ ఆస్పత్రికి వచ్చాక బాబుకు మల్టీఆర్గాన్‌ సమస్యలు వచ్చాయన్నారు. దాదాపు రెండు నెలల పాటు బాబుకు చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, 1.9 కిలోల బరువుకు చేరుకున్నాడని, తల్లిపాలు తాగుతున్నాడని వైద్యులు వివరించారు. శిశువును డిశ్చార్జీ చేసినట్లు తెలిపారు. నెలలు నిండని, ఆరోగ్య సమస్యలున్న శిశువును ఇలా రోడ్డుమార్గంలో 1,300 కి.మీ. దూరం తరలించడం ఇప్పటివరకు లేదని, ఇది గిన్నిస్‌ రికార్డు అవుతుందని ఆయన వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యానికి తీపి కబురు

పడిగాపులు.. తోపులాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 02 , 2025 | 07:21 AM