బీజేపీ నిర్ణయాలతో ప్రమాదంలో రాజ్యాంగం
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:55 AM
హిందూత్వ సిద్ధాంతం, కార్పొరేట్ శక్తులు అనే రెండు పిల్లర్లపైనే మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉందని సీపీఎం కేంద్ర సమన్వయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు.
సీపీఎం కేంద్ర సమన్వయ కార్యదర్శి ప్రకాశ్ కారత్
సంగారెడ్డి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హిందూత్వ సిద్ధాంతం, కార్పొరేట్ శక్తులు అనే రెండు పిల్లర్లపైనే మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉందని సీపీఎం కేంద్ర సమన్వయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. ఈ దేశాన్ని ఒకే మతానికి పరిమితం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నిర్ణయాలతో దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అసహనం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం ప్రతినిధుల సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రకాశ్ కారత్ హాజరై మాట్లాడారు.
సీపీఎం జాతీయ మహాసభలను మదురైలో నిర్వహిస్తామని, అక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకాశ్ కారత్ తెలిపారు. లగచర్లలో భూసేకరణపై బాధితుల పక్షాన పోరాటం చేయగానే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి.. సమస్యలపై కలిసి పనిచేద్దామని అన్నారని తెలిపారు. అయితే బీజేపీపై బీఆర్‌ఎస్ వైఖరిని స్పష్టం చేయనిదే తాము కలవబోమని చెప్పుకొచ్చారు. ఈ సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి