Share News

Jubilee Hills: పొలిటికల్ హీట్ పెంచుతున్న బైపోల్.. ఫలితాలు నిర్ణయించేది వీరే!

ABN , Publish Date - Oct 15 , 2025 | 07:27 AM

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు అధికశాతంలో ఉండటంతో ఉపఎన్నికల ఫలితాన్ని వీరే నిర్ణయించనున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లలో అధికశాతం బీసీలు, ముస్లింలు ఉండటంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలుపొందనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల ఆదరణ పొందే పనిలో నిమగ్నమయ్యారు.

Jubilee Hills: పొలిటికల్ హీట్ పెంచుతున్న బైపోల్.. ఫలితాలు నిర్ణయించేది వీరే!
Jubilee Hills

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 15: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఎన్నికలో బరిలో నిలిచారు. ఉపఎన్నిక కొద్దిరోజులే ఉండటంతో వీరంతా ప్రచారంలో మునిగిపోయారు. నియోజకవర్గంలోని రెహమత్​నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్​గూడ, షేక్‌‌పేట డివిజన్లలో పోటాపోటీగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు అధికశాతంలో ఉండటంతో ఉపఎన్నికల ఫలితాన్ని వీరే నిర్ణయించనున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లలో అధికశాతం బీసీలు, ముస్లింలు ఉండటంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే వారే గెలుపొందనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల ఆదరణ పొందే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి రాత్రివరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ గతంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారంలో జోరు పెంచుతున్నారు.


జూబ్లీహిల్స్‌‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982గా ఉంది. ఇందులో బీసీ ఓటర్లు దాదాపు 2 లక్షల వరకు ఉన్నారు. రెహమత్​నగర్, ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్​గూడ, షేక్‌‌పేట డివిజన్లలో అధిక శాతం పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఉన్నారు. ఈ డివిజన్లలో ఎక్కువశాతం మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో ముస్లిం ఓటర్ల సంఖ్య 96,500 వరకు ఉంది. బోరబండ, షేక్‌‌పేట, ఎర్రగడ్డలాంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉప ఎన్నిక ఫలితాలను తేల్చడంతో బీసీల తర్వాత వీరి పాత్ర కూడా కీలకమని చెప్పవచ్చు. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,07,367 , మహిళా ఓటర్లు 1,91,530 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో ముస్లిం ఓటర్లు 96,500 (24 శాతం) ఉన్నారు. వలస ఓటర్లు 35 వేలు (8.7 శాతం), ఎస్సీలు 26 వేలు (6.5 శాతం), మున్నూరు కాపు ఓటర్లు 21,800 (5.5 శాతం), కమ్మ ఓటర్లు 17 వేలు (4.5 శాతం), యాదవులు 14 వేలు (3.5 శాతం), క్రిస్టియన్లు 10 వేలు (2.5 శాతం) ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయా డివిజన్లలో ఉన్న మైనారిటీ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.


ఇక కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసున్న వారు 12,380 (3.10%) ఉన్నారు. 20 నుంచి 29 మధ్య వయసు వారు 17,500 (18.20%) మంది ఉన్నారు. 30 - 39 మధ్య వయసున్న ఓటర్లు 96,815 (24.30 శాతం) కాగా.. 40 నుంచి 49 మధ్య 87,492 (21.90శాతం), 50 నుంచి 59 మధ్య 67,703 (17శాతం), 60 – 69 మధ్య 38 వేలు (9.5 శాతం), 70 – 79 మధ్య వయసు ఉన్న ఓటర్లు 18వేలు (4.5శాతం), 80 ఏండ్లు ఆ పై వయసుగల ఓటర్ల సంఖ్య 6,052 (1.5శాతం) ఉన్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఓటర్లలో ఎక్కువగా 30–39, 40–49, 50–59 మధ్య వయస్సున్న ఓటర్లు ఏ పార్టీకి ఓటేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

Crop Procurement Begins: పంటల కొనుగోళ్లకు వేళాయె!

Polavaram Project: పోలవరం బనకచర్ల’ను పరిశీలించొద్దు

Updated Date - Oct 15 , 2025 | 07:27 AM