IPS Shivadhar Reddy: డీజీపీగా శివధర్ రెడ్డి
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:04 AM
డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనేదానిపై...
ఈ నెలాఖరున జితేందర్ పదవీ విరమణ
కొత్త బాస్ ఎవరు?.. పోలీసు శాఖలో చర్చ
నిఘా బాధ్యతలు సజ్జనార్‌కు.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. హైదరాబాద్ సీపీగా భగవత్!
అధికారుల పేర్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనేదానిపై ఆ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు ఇతర కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. కీలక బాధ్యతల్లో ఎవర్ని నియమించాలో ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ సీవీ ఆనంద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాను విజిలెన్స్‌కు, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీ (పీ అండ్ ఎల్) ఎం.రమే్‌షతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు, మూడు కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు, పలువురు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో ఏ ఇద్దరు అధికారులు కలిసినా త్వరలో జరగబోయే బదిలీలు, పోస్టింగ్‌లపైనే చర్చించుకుంటూ ఊహాగానాలు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతితో గడువు పెంచి కొనసాగిస్తున్నట్లే డీజీపీ జితేందర్‌ను కూడా కొనసాగించే అవకాశం ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News