Share News

త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ ట్యాప్‌!

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:02 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అధికారులు, న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ ట్యాప్‌!

  • బీజేపీలో కీలకం, ఆర్‌ఎ్‌సఎ్‌సతో సంబంధాల రీత్యానే

  • గవర్నర్‌గా నియమితులైన తర్వాత కూడా ట్యాపింగ్‌

  • ఆయన పీఏను పోలీసులు విచారించగా వెలుగులోకి

హైదరాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): తీవ్ర కలకలం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయం బయటపడింది. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు సారథ్యంలోని పోలీసులు 15 రోజులు ట్యాపింగ్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అధికారులు, న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, గవర్నర్‌గా వెళ్లకముందు రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఇంద్రసేనారెడ్డి అత్యంత సీనియర్‌. దీనికితోడు ఆర్‌ఎ్‌సఎస్‌ పెద్దలతో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆయన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇంద్రసేనారెడ్డి 2023 అక్టోబరు 6వ తేదీన త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.


అయినప్పటికీ, రాజకీయ నాయకుల కదలికలపై నిఘా వేసిన అప్పటి ఎస్‌ఐబీ బృందం.. ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌ను కొనసాగించింది. ఇటీవల ఇంద్రసేనారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నర్సింహను పోలీసులు విచారించగా ఈ సంగతి బయటపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ట్యాపింగ్‌ కేసులో పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు పారిపోయిన ఎస్‌ఐబీ నాటి చీఫ్‌ ప్రభాకర్‌రావు, మీడియా చానల్‌ యజమాని శ్రవణ్‌రావులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధ్యక్షుడు ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాల మేరకు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారివారి దేశాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావును ఏ విధంగా రప్పించాలనే విషయంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని డీజీపీ జితేందర్‌ ఇటీవల తెలిపారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 04:02 AM