Jeedimetla: పెంగ్విన్ నిర్వాహకురాలు స్వాతి అరెస్ట్
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:28 AM
అధిక వడ్డీల పేరుతో ప్రజ ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి, ఖాతాదారులకు డబ్బు లు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీస్ నిర్వాహకురాలు స్వాతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పరారీలో ప్రధాన నిందితుడు బాలాజీ
లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు
సంస్థ బ్యాంక్ ఖాతాలు, కార్యాలయం సీజ్
జీడిమెట్ల, మే 31 (ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీల పేరుతో ప్రజ ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి, ఖాతాదారులకు డబ్బు లు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీస్ నిర్వాహకురాలు స్వాతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. అతడిపై లుకౌట్ నోటీస్ జారీ చేసి, బ్యాంక్ అకౌంట్‌లను సీజ్ చేసినట్టు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ తెలిపారు. జీడిమెట్లలోని సెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి సీజ్ చేసి.. కార్యాలయం, నిందితుల ఇళు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బాలాజీ ట్యాబ్, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సూరారం కాలనీలో నివాసముంటున్న స్వాతిని అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం రిమాండ్‌కు తరలించారు.
మెహదీపట్నంలోని బాలాజీ అత్తవారింట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. బాలాజీ భార్య రత్నను ప్రశ్నించారు. దాదాపు 1530 మంది డిపాజిట్ దారులను నుంచి రూ.150 కోట్లు సేకరించిన బాలాజీ, స్వాతి.. పథకం ప్రకారం బోర్డు తిప్పేసేందుకు సిద్ధమయ్యారని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. బాలాజీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీ, స్వాతి గతంలో డింగ్ బ్యాటిల్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఇలాంటి సంస్థను నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. స్వాతి సోదరుడు, బాలాజీ స్నేహితులు. కాగా, 2015లో స్వాతి భర్త మరణించాడు. అప్పటి నుంచి స్వాతి, బాలాజీ కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా, పెంగ్విన్ సెక్యూరిటీస్ నిర్వాహకుల వలలో పడి మోసపోయిన పలువురు బాధితులు శనివారం కార్యాలయానికి రాగా తాళం వేసి ఉండటంతో కుప్పకూలిపోయారు. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో ఓ సెలబ్రిటీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, కేసును ఈవోడబ్ల్యూకి బదిలీ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News