Padma Devender Reddy: కేసీఆర్‌కు మచ్చ తెచ్చింది కవితే!
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:24 AM
బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఖండించారు.
హరీశ్‌రావుపై ఆమెవి నిరాధార ఆరోపణలు
వాటిని తెలంగాణ సమాజం నమ్మదు
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఖండించారు. హరీశ్‌రావుపై కవిత నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన వల్ల కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కవితే కేసీఆర్‌కు మాయని మచ్చ తెచ్చారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉంటూనే.. మూడు నెలలుగా కవిత వ్యవహరించిన తీరు, చేసిన విమర్శలతో పార్టీకి ఎంతో నష్టం కలిగిందన్నారు.
ఈ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదని, కవితపై సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నామని తెలిపారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేసీఆర్ కూతురుగా కవిత ఎక్కడికి వెళ్లినా ప్రజలు గౌరవించి ఘనంగా ఆదరించారని, కానీ.. ఆ గౌరవాన్ని ఆమె నిలుపుకోలేకపోయారని పేర్కొన్నారు. ‘‘అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసే హరీశ్‌ను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా? కవిత చేస్తున్న అసత్య ఆరోపణలను తెలంగాణ సమాజం నమ్ముతుందా?’’ అని పద్మా దేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News