Solar Corridor: సౌర కారిడార్‌గా ఓఆర్‌ఆర్
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:02 AM
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్ సౌరకారిడార్‌గా మారనుంది..
వంద మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళిక
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) సౌరకారిడార్‌గా మారనుంది. ఇప్పటికే దీని వెంట సుమారు 21 కిలోమీటర్ల మేర ఉన్న సైకిల్ ట్రాక్‌పై సౌర రూఫ్‌టాప్ ఏర్పాటు చేయడంతో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అలాగే 158 కిలోమీటర్ల పొడవున ఉన్న ఓఆర్‌ఆర్ సెంట్రల్ మీడియన్‌లో సౌర రూఫ్‌టాప్ ఏర్పాటు చేసి 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓఆర్‌ఆర్‌ను సౌర కారిడార్‌గా మార్చేందుకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేయడానికి కన్సల్టెన్సీ నియామకానికి చర్యలు చేపడుతోంది. దక్షిణ కొరియా దేశంలోని ప్రధాన రోడ్డుపై సైక్లింగ్ ట్రాక్‌తో పాటు సెంట్రల్ మీడియన్‌లో సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ఇలా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌తో అక్కడ రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలుగుతుంటాయి. అదే తరహాలో ఇక్కడ ఓఆర్‌ఆర్‌పై చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియామకానికి హెచ్‌జీసీఎల్ టెండర్లను ఆహ్వానించింది.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News