Operation Sindoor: సిందూర్ టైటిల్ కోసం 30 మంది పోటీ!
ABN , Publish Date - May 09 , 2025 | 02:53 AM
ఆపరేషన్ సిందూర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తారక మంత్రంలా వినిపిస్తున్న పేరు. పహల్గాంలో టూరిస్టులపై పాశవికంగా దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక చర్య జరిపి గట్టి బుద్ధి చెప్పింది కేంద్రప్రభుత్వం.
చిత్ర పరిశ్రమలో నిర్మాతల దరఖాస్తు
ఆ టైటిల్‌తో సినిమా తీస్తే చాలని..
హైదరాబాద్, మే 8: ఆపరేషన్ సిందూర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తారక మంత్రంలా వినిపిస్తున్న పేరు. పహల్గాంలో టూరిస్టులపై పాశవికంగా దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక చర్య జరిపి గట్టి బుద్ధి చెప్పింది కేంద్రప్రభుత్వం. మహిళలకు సిందూరం ఎంతో పవిత్రం కనుక దానిని దూరం చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంది. ‘మేమంతా మీ వెంటే’ అంటూ భారతీయ చిత్ర పరిశ్రమ సైతం ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్‌కు చిత్ర పరిశ్రమలో మంచి డిమాండ్ ఏర్పడింది. ‘ఆపరేషన్ సిందూర్’, ‘మిషన్ సిందూర్’, ‘సిందూర్.. ద రివెంజ్’.. ఇలా సిందూర్ అనే పదం వచ్చేలా రకరకాల టైటిల్స్‌తో రెండు రోజుల్లో 30 మంది నిర్మాతలు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు దరఖాస్తులు పెట్టుకోవడం విశేషం.
ఈ సంఖ్య శుక్రవారానికి 50 వరకూ పెరగవచ్చని అంటున్నారు. ‘ఒక వ్యక్తి ఎన్ని టైటిల్స్‌కి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఎవరు ముందు దరఖాస్తు పెట్టారో వారికే ఒక టైటిల్ ఇచ్చే పద్ధతి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్మాతైనా ‘సిందూర్’ టైటిల్‌తో సినిమా తీస్తే కచ్చితంగా అది పెద్ద న్యూస్ అవుతుంది’ అన్నారు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ నాగ్రత్. తమకు వచ్చిన దరఖాస్తుల్లో ‘హిందుస్థాన్ కా సిందూర్’, ‘మిషన్ ఆపరేషన్ సిందూర్’, ‘సిందూర్ కా బద్లా’, ‘పహల్గాం.. ద టెర్రర్ అటాక్’, ‘పహల్గాం ఎటాక్’ వంటి టైటిల్స్ కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ‘సిందూర్’ టైటిల్ కోసం ఈ మెయిల్ పెట్డడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News