Complaint Against Former Minister Jagadish Reddy: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఫిర్యాదు..
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:21 PM
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గాంధీ భవన్‌లో గురువారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై.. ప్రజల సమస్యలు వింటున్నారు. ఈ సందర్భంగా70 ఏళ్ల వృద్ధుడు మంత్రుల ఎదుట తన సమస్యను విన్నవించుకున్నాడు.
హైదరాబాద్, నవంబర్ 27: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గాంధీ భవన్‌లో గురువారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై.. ప్రజల సమస్యలు వింటున్నారు. ఈ సందర్భంగా70 ఏళ్ల వృద్ధుడు మంత్రుల ఎదుట తన సమస్యను విన్నవించుకున్నాడు.
ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తన దగ్గర నుంచి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపించాడు. తన సమస్యపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బోరున విలపించాడు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదు కాపీని మంత్రికి అందజేశాడు. వృద్ధుడి మాటలు విని అక్కడున్న వారంతా అయ్యో పాపం.. ఇంత అన్యాయం జరిగిందా.. అంటూ చర్చించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..
Read Latest Telangana News And Telugu News