Telangana Agriculture: యూరియాపై ఆందోళన వద్దు
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:38 AM
యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు అన్నారు...
సరఫరా పెంచేందుకు చర్యలు
42వేల టన్నుల యూరియా ఉంది
మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు
ఆర్‌ఎ్‌ఫసీఎల్, ఎన్‌ఎ్‌ఫసీఎల్ ప్రతినిధులతో భేటీ
హైదరాబాద్/కోల్‌సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఆగస్టు చివరి వరకు 37,877 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యూరియా సరఫరా పెంచేందుకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో రామగుండం ఫెర్టిలైజర్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్) సీఈవో అలోక్ సింఘాల్, నాగార్జున ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌ఫసీఎల్)తెలంగాణ సేల్స్ మేనేజర్ రాజేశ్‌తో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎ్‌ఫసీఎల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాలో ఇంకా 62,473 మెట్రిక్ టన్నులు అందలేదని మంత్రులు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సరఫరా ఆలస్యమవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. పంటలపై ప్రతికూల ప్రభావం పడకముందే, సమయానికి యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్, ఎన్‌ఎ్‌ఫసీఎల్స్ నుంచి రావాల్సిన వాటాలో 50ు యూరియాను ఈ వారంలోనే అందించేలా చూడాలన్నారు. స్పందించిన ఆర్‌ఎ్‌ఫసీఎల్ సీఈవో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అందించాల్సిన యూరియాను త్వరలోనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలి
సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మాణంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నామని సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సచివాలయంలో ఆయిల్ పామ్ పంట, మిల్లుల నిర్మాణాలు సహా పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. కల్లూరుగూడెంలో నిర్మించే ఫ్యాక్టరీ పనులను 2026 జూన్ వరకు పూర్తిచేయాలని, బీచుపల్లి ఫ్యాక్టరీ పను ల కోసం టెండర్లను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ అనుకున్న స్థాయిలో జరగడంలేదని, లక్ష్యాన్ని పూర్తి చేయడానికి హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్ శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News