Share News

TGNAB: మెడికల్‌ వీసాపై వచ్చి డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:50 AM

పన్నెండేళ్లుగా వేర్వేరు పేర్లతో మెడికల్‌ వీసాపై నైజీరియా నుంచి నేరుగా గోవాలో దిగి.. డ్రగ్స్‌ దందా చేస్తున్న ఘరానా పెడ్లర్‌ను తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) అరెస్టు చేసింది.

TGNAB: మెడికల్‌ వీసాపై వచ్చి డ్రగ్స్‌ దందా

  • నైజీరియా నుంచి నేరుగా గోవాకు

  • 12 ఏళ్లుగా పేర్లు మార్చి రాకపోకలు

  • నైజీరియన్‌ను అరెస్టు చేసిన టీజీ న్యాబ్‌

  • రూ.1.25 కోట్ల మత్తుపదార్థాల స్వాధీనం

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పన్నెండేళ్లుగా వేర్వేరు పేర్లతో మెడికల్‌ వీసాపై నైజీరియా నుంచి నేరుగా గోవాలో దిగి.. డ్రగ్స్‌ దందా చేస్తున్న ఘరానా పెడ్లర్‌ను తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) అరెస్టు చేసింది. నైజీరియాకు చెందిన ఇమాన్యుయేల్‌ బెడియాకో అలియాస్‌ మాక్స్‌వెల్‌ అలియాస్‌ మాక్స్‌ అనే వ్యక్తి.. రూ.కోట్లలో డ్రగ్స్‌ దందా చేసి, రూ.60 లక్షల వరకు కమీషన్‌ పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు వివరాలను టీజీ న్యాబ్‌ డీజీ సందీప్‌ శాండిల్య వెల్లడించారు. మ్యాక్స్‌ తొలుత 2013లో బెంగళూరులో చికిత్స పేరుతో భారత్‌కు వచ్చాడు.


అక్కడి నుంచి గోవాకు వెళ్లి, మరో నైజీరియన్‌ రోమీతో కలిసి డ్రగ్స్‌ దందా మొదలుపెట్టాడు. ఇలా.. 2022 వరకు గోవా, హైదరాబాద్‌తోపాటు.. దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌ దందా చేశాడు. ఆ తర్వాత మళ్లీ నైజీరియాకు వెళ్లి.. 2023 తర్వాత రెండుసార్లు మారు పేర్లతో మెడికల్‌ వీసాపై వచ్చాడు. గోవాలోని రోమీతో కలిసి డ్రగ్స్‌ దందాను కొనసాగించాడు. హైదరాబాద్‌లో ఇతని కదలికలపై ఉప్పందుకున్న టీజీ న్యాబ్‌ పోలీసులు.. పక్కా వ్యూహంతో అరెస్టు చేశారు. ఇతని నుంచి రూ.1.25 కోట్లు విలువ చేసే 550 గ్రాముల కొకైన్‌, 11 వందల ఎక్సటసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై రెడ్‌కార్నర్‌ నోటీసును జారీ చేసి, నైజీరియాకు డీపోర్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సందీప్‌ శాండిల్య వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 04:50 AM