Share News

Hyderabad: నయా ఎక్స్‌ప్రెస్‌ వే.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్‌ వరకు నిర్మాణం..

ABN , Publish Date - Dec 13 , 2025 | 09:21 AM

హైదరాబాద్‌ మహా నగరంలోమరో కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే కు అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: నయా ఎక్స్‌ప్రెస్‌ వే.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్‌ వరకు నిర్మాణం..

- డీపీఆర్‌ తయారీకి.. కన్సల్టెన్సీ నియామకానికి చర్యలు

- టెండర్లను ఆహ్వానించిన హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టడంతో పాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు వేగంగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే’కు అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే(Six-lane expressway) నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్‏వేను ఎలివేటెడ్‌ కారిడార్‌లో నిర్మించేందుకు డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారీకి, కన్సల్టెన్సీ నియామకానికి చర్యలు చేపట్టారు.


ఇందుకోసం హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన నయా ఎక్స్‌ప్రెస్‌ వేను బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12 నుంచి ఫిలింనగర్‌, జడ్జస్‌ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్‌, శిల్పా లేఅవుట్‌ మీదుగా ప్రతిపాదించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్‌ సమీపంలోని ఫ్లైఓవర్‌ వరకు ఈ సరికొత్త రహదారికి ప్లాన్‌ చేస్తున్నారు.


city5.2.jpg

దాదాపు పది కిలోమీటర్ల మేర నిర్మించాలని భావిస్తున్న ఈ రహదారిలో దాదాపు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పా్‌సలతోపాటు ఎక్కడా వాహనం ఆగకుండా వెళ్లేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌ నిర్మించాలని భావిస్తున్నారు. వారం రోజుల్లో టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. 90 రోజుల్లో సంబంధిత కన్సల్టెన్సీ పూర్తిస్థాయి నివేదిక అందజేయాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్‌ టీచర్‌

మా ఊరికి రోడ్డు వేయరూ..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2025 | 09:21 AM