Remand Prisoner Death: మహిళా జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:21 AM
వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా జైలు సూపరింటెండెంట్ కే.ఎన్.ఎ్‌స.లక్ష్మీశ్రుతిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ..
రిమాండ్ ఖైదీ మృతికి నిర్లక్ష్యమే కారణం!
అంతర్గత విచారణలో తేల్చిన అధికారులు
సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సౌమ్యమిశ్రా
నర్సంపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా జైలు సూపరింటెండెంట్ కే.ఎన్.ఎ్‌స.లక్ష్మీశ్రుతిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెండ్యాల సుచరిత మృతికి సంబంధించి.. సూపరింటెండెంట్ నిర్లక్ష్యమే కారణమని అంతర్గత విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడిన సుచరిత ఆస్పత్రికి తీసుకెళ్లకపోగా.. ఆమెను మానసికంగా హింసించారనే ఆరోపణలు వెలువడ్డాయి. దళిత సంఘాలు కూడా జైలు అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో అంతర్గత విచారణ జరిపినట్లు జైళ్ల శాఖ అధికారి పరావస్తు వెంకటేశ్వరస్వామి తెలిపారు. మహిళా సూపరింటెండెంట్ లక్ష్మీశ్రుతి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రాథమిక సమాచారంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని వివరించారు. లక్ష్మీశ్రుతి స్థానంలో స్రవంతిని సూపరింటెండెంట్‌గా నియమించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News