Nalgonda: గురుకుల పాఠశాలలోకి ప్రవేశించిన దుండగులు.. విద్యార్థినిలు నిద్రిస్తుండగా..
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:35 PM
నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది యువకులు హాస్టల్ గోడ దూకడం తీవ్ర కలకలం రేపింది.

నల్గొండ: దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. కామాంధులు అత్యాచారాలు, హత్యాచారాలతో రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ ఆడవారిపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు ప్రేమోన్మాదులు సైతం రెచ్చిపోతున్నారు. ప్రేయసి దక్కకపోతే వారిపై కత్తులు, యాసిడ్‌తో దాడులు చేస్తున్నారు. నిలువునా ప్రాణాలు తీసేస్తూ తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇళ్లు, పాఠశాలలు కూడా వారికి రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఉపాధ్యాయుల రూపంలోనూ కొంతమంది కామాంధులు తెగబడుతున్న ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. మరోవైపు రోడ్లు, బస్టాండ్లు, కళాశాలల వద్ద ఎక్కడ చూసినా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది యువకులు హాస్టల్ గోడ దూకడం తీవ్ర కలకలం రేపింది. అందరూ నిద్రిస్తుండగా ప్రవేశించిన దుండగులు మెల్లిగా పదో తరగతి బాలికలు నిద్రిస్తున్న గదుల్లోకి చొరబడ్డారు. ఎటువంటి అలకిడీ లేకుండా వారి వద్దకు వెళ్లారు. విద్యార్థినిలను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు. కామాంధులు ఓ విద్యార్థిని ఒంటిపై ఉన్న బట్టలు తీసేసేందుకు యత్నించారు. ఆమెకు కూడా తెలియకుండా బట్టలు విప్పే ప్రయత్నం చేశారు.
కత్తెరతో బాలిక బట్టలు కత్తిరించడం మెుదలుపెట్టారు. అయితే మెలకువ రావడంతో చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆకతాయిలంతా అక్కడ్నుంచి పరారయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ గదుల్లోకి రావడంతో విద్యార్థినిలు ఒక్కసారిగా కేకలు పెట్టారు. భయంతో వణికిపోయారు. హాస్టల్ సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు. అయితే కామాంధుల నుంచి రక్షణ కల్పించాలని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాలికలు కోరుతున్నారు. మరోసారి ఇంకెవ్వరూ రాకుండా హాస్టల్ చుట్టూ పటిష్ట ఏర్పాట్లు చేయాలని విద్యార్థినిలు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..
Attack on Rangarajan Case: రామరాజ్యం వీరరాఘవరెడ్డి గురించి పోలీసులు ఏం చెప్పారంటే..