Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:37 PM
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నల్గొండ, సెప్టెంబర్ 29: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులతోపాటు అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక మృతదేహాలను సైతం స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో వీరంతా దేవరకొండ మండలం ముదిగొండ అవాసం మటిక తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు.. రాత్లావత్ భాస్కర్ (29), రాత్లావత్ వినోద్ (29), సఫవత్ రవి (29)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్