Miyapur: అవి ఆత్మహత్యలే!
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:27 AM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్, మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మరణం కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పెరుగన్నంలో విషం కలుపుకొని తిని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నుట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
మియాపూర్‌లో కుటుంబం మరణంపై వీడిన మిస్టరీ
అన్నంలో విషం కలుపుకొని మృతి
పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడి
ఆర్థిక ఇబ్బందులే కారణం!
మియాపూర్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్, మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మరణం కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పెరుగన్నంలో విషం కలుపుకొని తిని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నుట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కుటుంబ పెద్ద లక్షప్ప(60), వెంకటమ్మ(55) దంపతులతోపాటు వారి రెండో కుమార్తె కవిత, అల్లుడు అనిల్, కవిత దంపతుల కుమారుడు యువాన్ష్(2).. మియాపూర్‌లోని మక్తమహాబుబ్‌పేటలోని తమ ఇంట్లో విగతజీవులై గురువారం కనిపించిన సంగతి తెలిసిందే. కుటుంబంలో ఒకేసారి ఐదుగురు మరణించడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, వీరంతా విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలడంతో.. హత్యలు కాదు ఆత్మహత్యలేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం లక్షప్ప సహా ఐదుగురు పెరుగన్నంలో విషం కలుపుకొని తిన్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. కాగా, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టారు. అనుమానించే విధంగా ఎలాంటి సమాచారం లభ్యం కాకపోవడంతో ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారనే నిర్ధారణకు వచ్చారు. విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు కేసు వివరాలను వెల్లడించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News