Share News

Minister Tummala Nageswara Rao : మీ కపట నాటకాలు ఆపండి.. BRS నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:35 PM

బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకంటూ మండిపడ్డారు.

Minister Tummala Nageswara Rao : మీ కపట నాటకాలు ఆపండి.. BRS నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం
Minister Tummala Nageswara Rao

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేస్తున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖండించారు. ఇదంతా కపట నాటకమని మండిపడ్డారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా? లేక కేంద్ర ప్రభుత్వమా.. కారణమేదో మీకు తెలియదా? యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా? అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు. జియో పాలిటిక్స్ వల్ల దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు అంటూ మండిపడ్డారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకని ఫైర్ అయ్యారు.


రేవంత్ రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్ పై మీ శాపనార్ధాలు ఏంటి? అని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


Also Read:

సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తీవ్ర విషాదం.. గుండె పోటుతో ఆస్పత్రిలోనే ప్రాణం విడిచిన గుండె డాక్టర్..

For More Latest News

Updated Date - Aug 30 , 2025 | 03:35 PM