Minister Surekha: మట్టి గణపతులనే పూజిద్దాం
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:19 AM
పర్యావరణ అనుకూలంగా గణేశ్ చతుర్థిని జరుపుకుందామని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు..
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ అనుకూలంగా గణేశ్ చతుర్థిని జరుపుకుందామని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈసారి పర్యావరణానికి హాని కలిగించే ప్యాస్టర్ ఆఫ్ పారి్‌స(పీఓపీ) విగ్రహాలకు దూరంగా ఉందామని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తయారు చేసిన పర్యావరణ హిత మట్టి గణేశ్ విగ్రహాలను సచివాలయంలో మంత్రి కొండా సురేఖ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భక్తులు మట్టి గణేశ్ విగ్రహాల్నే పూజించాలని, నదులు, సరస్సులకు హాని కలిగించే పీఓపీతో తయారు చేసిన విగ్రహాల వాడకానికి దూరంగా ఉండాలని సూచించారు. పీసీబీ రూపొందించిన పర్యావరణహిత మట్టి గణేశ్ విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించే పోస్టర్‌ను ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆవిష్కరిచాఆరు. పీసీబీ సభ్య కార్యదర్శి రవి, చీఫ్ ఇంజనీర్ రఘు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా విద్యార్ధులకు మట్టి విగ్రహాల తయారీపై వర్క్‌షాప్, ఆటో రిక్షాలపై అవగాహన పోస్టర్లు, 3.24 లక్షలకుపైగా మట్టి విగ్రహాల పంపిణీ తదితర కార్యక్రమాల్ని ఈ సంవత్సరం గణేశ్ చతుర్థి సందర్భంగా పీసీబీ చేపట్టింది. కాగా, దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో పని చేస్తున్న 10 మంది అర్చక, సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. వేదపారాయణం చేసే అర్చకులకు గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కు, గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు పదోన్నతులు ఇస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అలాగే, ఈవో స్థాయిలో గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కు, మోఫిసిల్ సీనియర్ అసిస్టెంట్ నుంచి ఈవో గ్రేడ్-2కు, దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ నుంచి కన్వర్షన్ ఆఫ్ సర్వీసెస్ కింద ముగ్గురికి ఈవో గ్రేడ్-3 పదోన్నతి కల్పించారు. పదోన్నతి పత్రాలను సచివాలయంలో దేవాదాయ మంత్రి కొండా సురేఖ అర్చకులు, సిబ్బందికి శనివారం అందించారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News