Minister Seethakka: తెలంగాణ మహిళా పోలీసులకు దేశంలో మంచి పేరు
ABN , Publish Date - Aug 21 , 2025 | 07:15 AM
తెలంగాణ మహిళా పోలీస్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తూ దేశంలో మంచిపేరు తెచ్చుకుంటున్నారని, ఇది చాలా గొప్ప విషయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.
- రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్: తెలంగాణ మహిళా పోలీస్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తూ దేశంలో మంచిపేరు తెచ్చుకుంటున్నారని, ఇది చాలా గొప్ప విషయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మొదటి తెలంగాణ మహిళా పోలీసు రాష్ట్ర సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పోలీసు విభాగంలో మహిళ పాత్ర విశేషమన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు అంతా సమర్థులే అని కొనియాడారు.

మహిళా శిశు సంక్షేమం తరఫున గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మహిళలు పోలీసు శాఖలో చేరేలా తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మహిళా పోలీసులతో సమన్వయం కోసం డీజీపీ ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మహిళా పోలీసులకు తమిళనాడు తరహాలో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళా అధికారులు ఆరోగ్యం, మానసిక ఒత్తిడి జయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు స్వాతిలక్రా, బాలనాగాదేవి, చారుసిన్హా, రమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News