Seethakka: బీఆర్ఎస్ విమర్శలు చేయడం అనవసరం.. మేము చేసి చూపించాం..
ABN , Publish Date - Feb 06 , 2025 | 08:31 PM
ప్రజల సంక్షేమం కోసం మేము చేస్తున్న పనులు ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ క్రమంలో వారు చేయని పనులు మేము చేసినందుకే ప్రతి దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) క్రమంగా వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క (Minister Seethakka) తాజాగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేయడం అనవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై, పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ "సంక్షేమ కార్యక్రమాలు, కులగణన, SC వర్గీకరణ వంటి అంశాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. ఈ కారణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆమె తెలిపారు.
మేము చేసి చూపించాం..
దీంతోపాటు ఉచిత బస్ సేవ, రేషన్ కార్డు, కులగణన, SC వర్గీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి దానికి ఉల్టా ప్రచారం చేస్తోందని సీతక్క విమర్శించారు. అసలు దేశంలో ఏ రాష్ట్రం కులగణన చేయలేదన్నారు. కానీ మన రాష్ట్రంలో కులగణన చేసి, దాని ఫలితాలను ప్రజలకు చూపించాం. బీఆర్ఎస్ చేయని పనులు మేము చేసినందున, వారు మాపై విమర్శలు చేయడం అనవసరమని వ్యాఖ్యానించారు.
అనేక మంది ఆసక్తి..
ఇంటి ఇంటికి తిరిగి సిబ్బంది పకడ్బందీగా సర్వే చేశారు. ఈ సర్వేలో కొన్ని అంశాలు తక్కువగా ఉన్నాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కామెంట్స్ చేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో సర్వే చేసి వివరాలు పూర్తిగా బయట పెట్టలేదని మంత్రి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం మేము చేస్తున్న పనులు, కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సీతక్క తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం మేము చేస్తున్న కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయని, అందుకే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని సీతక్క అన్నారు.
ఈవార్తలను కూడా చదవండి:
Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
For Telangana News And Telugu News