Medigadda Barrage: చెడులోనూ మంచి!
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:45 AM
చెడులోనూ మంచి అంటే ఇదేనేమో..! కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తీవ్ర నష్టమే కలిగించినా..
మేడిగడ్డ కుంగుబాటుతో మంచిర్యాలకు తప్పిన ముంపు
నీటి నిల్వను ఆపేయడంతో ప్రవాహానికి తొలగిన అడ్డంకి
భారీ వర్షాలు కురుస్తున్నా పట్టణం దరిచేరని వరద నీరు
మంచిర్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): చెడులోనూ మంచి అంటే ఇదేనేమో..! కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తీవ్ర నష్టమే కలిగించినా.. మంచిర్యాల ప్రజలకు మాత్రం ఓ రకంగా మేలు చేసిందని చెప్పవచ్చు. మేడిగడ్డ కుంగుబాటు మంచిర్యాలను వరద ముంపు బాధ నుంచి తప్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి వర్షాకాలంలో మంచిర్యాలను వరదలు చుట్టుముట్టడం ఆనవాయితీగా మారింది. గోదావరి ఉప్పొంగిన ప్రతిసారి మంచిర్యాల జలమయం అయ్యేది. 2022 నుంచి మంచిర్యాలలో ఇదే పరిస్థితి.
కానీ, ప్రస్తుతం కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా, గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోన్న వరదలు మంచిర్యాల దరిదాపులకు రాలేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి అధికారులు అందులో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో గోదావరి ప్రవాహానికి అడ్డు తొలగిపోయి బ్యారేజీలోకి వచ్చిన నీరంతా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లిపోతోంది. దీంతో మంచిర్యాలకు వరద ముంపు తప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News