Nalgonda: ప్రియురాలే ప్రాణం తీసింది!
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:46 AM
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో 34 ఏళ్ల వ్యక్తిని ఒకే కుటుంబానికి చెందిన వారు విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘ టనలో అతడు తీవ్రగాయాలతో మృతిచెందాడు.
కొన్నేళ్లుగా వ్యక్తితో వివాహేతర సంబంధం
భర్త, కుటుంబసభ్యులతో కలిసి అతడిపై దాడి
చెట్టుకు కట్టేసి కొట్టడంతో గాయాలతో మృతి
నల్లగొండ జిల్లా నోములలో ఘటన
పెద్ద మొత్తంలో డబ్బు, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతోనే ఘాతుకం
నల్లగొండ క్రైం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో 34 ఏళ్ల వ్యక్తిని ఒకే కుటుంబానికి చెందిన వారు విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘ టనలో అతడు తీవ్రగాయాలతో మృతిచెందాడు. ఆ ఇంట్లోని మహిళతో ఏళ్లుగా అతడు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, ఆ వ్యక్తి బలహీనతను ఆసరాగా చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బు, ఇంటి స్థలం ఇవ్వాలని ఒత్తిడి చేసినా అతడు నిరాకరించడంతో ప్రియురాలే ట్రాప్ చేసి ఇంటికి రప్పించి కుటుంబసభ్యులతో కలిసి కొట్టి చంపినట్లు మృతుడి సంబంధీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి మర్మాం గాలపై దాడి చేశారని, కళ్లలో కారంకొట్టి ఉరికించారని, పొలం లో గడ్డి చెక్కే పారతో ఒళ్లంతా చెక్కారని, కాళ్లు విరగ్గొట్టారని మృతుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆరోపించింది. ఆమె, బంధువులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తి గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఆమె భర్త, కుటుంబసభ్యులు జానయ్యను పట్టుకొని తీవ్రంగా కొట్టారు. వారి నుంచి తప్పించుకొని జానయ్య ఇంట్లోంచి పరుగులు పెట్టగా వెంబడించి పట్టుకున్నారు. చీర, తాడుతో ఓ చెట్టుకు జానయ్యను కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఎవ్వరైనా అడ్డుకుంటే వారికి కూడా ఇదేగతి పడుతుందంటూ చుట్టూ గుమిగూడిన స్థానికులను వారు హెచ్చరించడంతో జానయ్య ను కాపాడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.
దాడి జరుగుతుండగానే స్థానికుల్లో ఒకరు.. జానయ్య పిన్ని కుమారుడికి ఫోన్ చేసి సమాచారమివ్వడంతో అతడొచ్చి.. 108లో బాధితుడిని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నల్లగొండ జనరల్ ఆస్పత్రికి తరలించాడు.. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే జానయ్య మృతిచెందాడు. కాగా, జానయ్య సదరు వివాహితతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. దీనిపై గ్రామ పెద్ద లు, పోలీసుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా జరిగిందని మృతుడి తల్లి ప్రమీల చెప్పింది. వివాహేతర సంబంధంపై నిరుడు అక్టోబరులో కేసు పెట్టడంతో జానయ్య కొన్నాళ్లు జైల్లో ఉన్నాడని నకిరేకల్ పోలీసులు తెలిపా రు. జైలు నుంచి బయటకొచ్చాక కూడా ఆ మహిళతో జాన య్య సంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ క్రమంలో ఆ వివాహిత కుటుంబసభ్యులు జానయ్యను డబ్బుల కోసం వేఽధించారని, ఇంటి స్థలా న్నీ రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని ప్రమీల ఆరోపించింది. వారి ఒత్తిడికి జానయ్య తలొగ్గకపోవడంతోనే పథకం ప్రకా రం ఆమే తన కుమారుడికి ఫోన్ చేసి.. మెసేజ్‌లు పెట్టి మరీ ఇంటికి పిలిపించుకొని చంపించిందని ప్రమీల ఆరోపించింది. వివాహేతర బంధానికి సం బంధించి తన కుమారుడు 10లక్షల దాకా జరిమానా రూపంలో చెల్లించాడని పేర్కొంది. తన కుమారుడి చావుకు కారణమైన వివాహిత, ఆమె భర్త, కూతురు, అత్తామామలపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంఽధించి ఆరోపణలెదుర్కొంటున్న భార్యాభర్తలు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. తీవ్రగాయాలతో చెట్టుకు వేలాడుతున్న జానయ్య ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News