MLC Election Result: ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలిచిందెవరంటే..
ABN , Publish Date - Mar 03 , 2025 | 09:46 PM
MLC Election Result: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఫలితాలు అనధికారికంగా వెలువడ్డాయి. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఇక నల్లొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.
కరీంనగర్, మార్చి 03: తెలంగాణలోని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించారు. ఇక నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని అందుకొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన సొంతమైంది. అలాగే వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. మార్చి 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి.
వాటికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మార్చి 3వ తేదీ ఉదయం ప్రారంభమైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక 2 ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అదే విధంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ రోజు జరుగుతోంది.
వీటిలో రెండు స్థానాల ఫలితాలు తేలిపోయాయి. వాటి విజేతలు ఎవరో స్పష్టత వచ్చేసింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే కౌంటింగ్ సైతం కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బీజేపీ బోణి కొట్టింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందారు. కొమురయ్యకు 12,959 ఓట్లు పోలైయ్యాయి. ఇక 12081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కొమురయ్య అవలీలగా దాటారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. కొనసాగుతోన్న కూంబింగ్
ఇక ఈ ఎన్నికల బరిలో నిలిచిన వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్‌కు 2621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు పోలైయ్యాయి. ఇక నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాలరెడ్డి విజయాన్ని అందుకొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఆయన 11, 800 ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు
Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..
Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
For AndhraPradesh News and Telangana News