Share News

Mahesh Kumar Goud: పొంగులేటిపై.. టీపీసీసీ చీఫ్‌ ఫైర్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 03:33 AM

నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahesh Kumar Goud: పొంగులేటిపై.. టీపీసీసీ చీఫ్‌ ఫైర్‌

  • స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మహేశ్‌గౌడ్‌.. మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్న

  • బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన, కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ

  • పార్టీ లైన్‌ దాటి మాట్లాడొద్దని ఫోన్‌లో సూచనలు

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ శాఖ పరిధిలో లేని అంశాలపై ఎందుకు మాట్లాడారు? విధానపరమైన అంశాలపై మంత్రి మండలిలో చర్చించకుండా మాట్లాడతారా? పార్టీలో నిర్ణయం తీసుకోకుండానే శ్రేణులను అయోమయానికి గురిచేసేలా ప్రకటనలు చేయడమేంటి?’’ అని ఫోన్‌లో ప్రశ్నించారు. సున్నితమైన బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యేనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని, తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ లైన్‌ దాటి మాట్లాడటం, సంబంధం లేని మంత్రిత్వ శాఖ తరఫున ప్రకటనలు చేయడాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది.


ఈ విషయమై నేరుగా పొంగులేటికే ఫోన్‌ చేసిన టీపీసీసీ చీఫ్‌.. పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది? క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను ముందే మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించినట్టు సమాచారం. మంత్రులు వారి శాఖల పరిధిలోనే మాట్లాడాలని, కోర్టు పరిధిలో ఉన్న సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ మంత్రి అయినా తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలనే మాట్లాడాలని, ఇతర మంత్రుల శాఖలకు సంబంధించిన అంశాలపై మాట్లాడటం తగదని సున్నితంగా హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టాక.. ఒక మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలి సారి కావడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 03:33 AM