Share News

Three People killed in Jogulamba Gadwal: పొలంలో పిడుగు పడి.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:57 PM

జోగులంబ గద్వాల్ జిల్లాలో అయిజ మండలం భూంపురంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం పత్తి పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై పిడుగు పడింది.

Three People killed in Jogulamba Gadwal: పొలంలో పిడుగు పడి.. ముగ్గురు మృతి
Lightning Strike three killed in jogulamba gadwal District

అలంపూర్, సెప్టెంబర్ 10: జోగులంబ గద్వాల్ జిల్లాలో అయిజ మండలం భూంపురంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం పత్తి పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. వారిని గద్వాల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులు సాభాగ్య (40), పార్వతి (22), సర్వేష్ (20)గా గుర్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

For More TG News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 07:00 PM