Hyderabad: రూ.100 కోట్ల పన్ను ఎగవేత
ABN , Publish Date - May 17 , 2025 | 04:02 AM
రూ.వంద కోట్ల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని కార్‌లాంజ్ షోరూం యజమాని బషారత్ అహ్మద్ ఖాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేశారు.
లగ్జరీ కార్ల డీలర్ అరెస్టు
హైదరాబాద్‌లో బషారత్ అదుపులోకి
అహ్మదాబాద్‌కు తరలింపు
కార్లు కొనుగోలు చేసిన వారిలో నేతలు, ప్రముఖులు
పన్ను ఎగవేతతో సంబంధం ఉన్న వారిపైనా దర్యాప్తు
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): రూ.వంద కోట్ల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని కార్‌లాంజ్ షోరూం యజమాని బషారత్ అహ్మద్ ఖాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో నమోదైన కేసు ఆధారంగా ఖాన్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. అమెరికా, జపాన్‌లలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్‌కు ఖాన్ తరలించినట్టు అధికారులు గుర్తించారు. పన్నులు తప్పించుకోవడానికి అహ్మద్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు డీఆర్‌ఐ విచారణలో వెల్లడైంది. విదేశీ లగ్జరీ కార్ల అసలు ధరకన్నా కొన్ని సందర్భాల్లో 50 శాతం తక్కువకు నకిలీ ఇన్‌వాయి్‌సలు సృష్టించారని, కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసేందుకు అమెరికాలో కొన్న కారును శ్రీలంక ద్వారా భారత్‌కు తీసుకొచ్చేవారని అధికారులు తెలిపారు.
అహ్మద్‌తోపాటు అతని వ్యాపార భాగస్వాములు ఇలా దేశంలోకి వచ్చిన కార్లను అహ్మదాబాద్‌లోని ఫామ్‌హౌ్‌సలో దాచినట్టుగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఖాన్ వద్ద కార్లు కొనుగోలు చేశారని, వీటిలో కొన్ని కార్లను పూర్తిగా నగదు చెల్లించి కొన్నట్టుగా అనుమానిస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. అమెరికా, జపాన్‌లో కొన్న ఖరీదైన లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను శ్రీలంకకు తరలించాక అక్కడ భారత్‌లో వాడేందుకు వీలుగా రైట్ హ్యాండ్ డ్రైవ్‌కు మార్చడమేకాకుండా దీనికి అనుగుణంగా పత్రాలు సృష్టించినట్టు చెప్పారు. దాదాపు 30 కార్లను ఈ విధంగా ఖాన్ తెప్పించారని, ఈ కార్లను కొన్న పలువురు పన్ను ఎగవేతలో భాగస్వాములైన క్రమంలో వారిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News