Share News

Lashkar Bonalu: లష్కర్‌ బోనాలకు అమ్మవారి ఆలయాలు సిద్ధం..

ABN , Publish Date - Jul 11 , 2025 | 08:13 AM

ఈ నెల 13, 14వ తేదీల్లో జరిగే బోనాల జాతరకు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయంతో పాటు లష్కర్‌లోని అమ్మవారి ఆలయాలను సిద్ధం చేస్తున్నారు.

 Lashkar Bonalu: లష్కర్‌ బోనాలకు అమ్మవారి ఆలయాలు సిద్ధం..

- ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు

సికింద్రాబాద్‌: ఈ నెల 13, 14వ తేదీల్లో జరిగే బోనాల జాతరకు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయంతో పాటు లష్కర్‌లోని అమ్మవారి ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. జాతర సమీపిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ మేరకు అన్ని విభాగాలతో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయ ప్రాంగణంలో గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది.


ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్‌, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కృష్ణవేణి, ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి, మహంకాళి ఏసీపీ సైదయ్య, ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌లతోపాటు ఆలయ బోనాల జాతర కమిటీ సభ్యులు, భక్తులు సమావేశంలో పాల్గొన్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేక రెండు లైన్లు, సాధారణ భక్తుల కోసం మరో లైన్లు, వీటికి అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.


city4.3.gif

2,500 మందితో పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మహంకాళి పోలీస్ స్టేషన్‌(Mahankali Police Station)లో 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచనున్నట్టు చెప్పారు. 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట, మూడు గంటల మధ్య బాటా నుంచి ఆలయానికి శివసత్తులను అనుమతించనున్నట్టు వెల్లడించారు.


బంగారు బోనం సమర్పణ

భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఉజ్జయినీ వుహాకాళి అమ్మవారికి గురువారం బంగారు బోనం సమర్పించారు. కమిటీ సభ్యులతో భక్తురాలు నిషా క్రాంతి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 08:13 AM