Share News

KTR Warns: ప్రభుత్వం స్పందించకుంటే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:34 AM

రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమంటూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ శనివారం డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సుదీర్ఘ లేఖ రాశారు...

KTR Warns: ప్రభుత్వం స్పందించకుంటే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం

  • విద్యుత్‌ బ్యాక్‌ బిల్లింగ్‌ బకాయిలు 35.48 కోట్లు మాఫీ చేయాలి

  • డిప్యూటీ సీఎం భట్టికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ లేఖ

సిరిసిల/హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమంటూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ శనివారం డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సుదీర్ఘ లేఖ రాశారు. సిరిసిల్లలోని పవర్‌లూమ్‌ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. పవర్‌లూమ్‌ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల విద్యుత్‌ బ్యాక్‌ బిల్లింగ్‌ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్‌ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. భారతదేశంలో త్వరలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పిన ఒపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్‌ నుంచి కంపెనీ కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ లేఖ ద్వారా కోరారు. వచ్చేనెలలో భారత్‌లో పర్యటిస్తానని ప్రకటించిన సామ్‌ ఆల్ట్‌మన్‌కు హైదరాబాద్‌ నగరం స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. కాగా, పారిశుద్ధ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు అన్నారు.. పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాటాడుతూ.. నగరంతోపాటు పల్లెల్లోనూ గతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:34 AM