KTR BC Reservation Comment: బీసీ రిజర్వేషన్, డిక్లరేషన్ అంతా బోగస్
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:44 AM
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, బీసీ డిక్లరేషన్ అంతా బోగస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్..
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, బీసీ డిక్లరేషన్ అంతా బోగస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో పార్టీ బీసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ తెచ్చే చట్టం ఆమోదం పొందదని తెలిసినా, ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టులు, చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అప్పుడే పుట్టిన శిశువులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను పంపిణీ చేసిందని.. రేవంత్ సర్కారు దురుద్దేశంతోనే వాటిని నిలిపివేసిందని కేటీఆర్ మండిపడ్డారు. గురువారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురికి ఆయన కేసీఆర్ కిట్లను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి