Kishan Reddy: దాడి చేస్తే బ్రహ్మోస్ ప్రయోగిస్తాం
ABN , Publish Date - May 16 , 2025 | 03:34 AM
పాకిస్థాన్ ఇకమీదట భారత్‌పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

మే 17న ట్యాంక్‌బండ్‌లో తిరంగా ర్యాలీ
రామప్ప గుడిలో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా?
తెలంగాణ ఆడపడుచులకు ఇంతటి అవమానమా?: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ ఇకమీదట భారత్‌పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు అనేకంగా జరిగేవని, సంతాపాలు ప్రకటించి మర్చిపోతుండేవారని విమర్శించారు. గత పదేళ్లుగా మోదీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, ఐఎ్‌సఐ నెట్‌వర్క్‌ను అంతం చేసిందని వెల్లడించారు. మే 17న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
దేశ రక్షణ కోసం పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా నిలిచేందుకు, వారి త్యాగాలకు అభినందనగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. రామప్ప దేవాలయంలో విదేశీ వనితల కాళ్లు తెలంగాణ ఆడపడుచులతో కడిగించారంటూ కిషన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. ఇందుకుగానూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News