Share News

Tummala : ఆగస్టు 15 నాటికి ఖమ్మం-దేవరపల్లి హైవే సిద్ధం

ABN , Publish Date - May 16 , 2025 | 04:08 AM

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి వాహన రాకపోకలను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Tummala : ఆగస్టు 15 నాటికి ఖమ్మం-దేవరపల్లి హైవే సిద్ధం

  • ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి : మంత్రి తుమ్మల

ఖమ్మం, మే15 (ఆంధ్రజ్యోతి)/వేంసూరు: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి వాహన రాకపోకలను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నేషనల్‌ హైవే అథారిటీ, రెవెన్యూ, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో కలిసి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఏపీలోని చింతలపుడి మండలం గుడిపట్లగూడెం గ్రామం నుంచి వైరా, కొణిజర్ల మీదుగా ధంసలాపురం వరకు 100 కిమీల మేర కారులో ప్రయాణిస్తూ పనులను పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేశారు.


హైవే పరిశీలన తర్వాత తుమ్మల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఏపీలో మొత్తం 5 ప్యాకేజీల కింద ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయని, అందులో 3 ప్యాకేజీలు ఖమ్మం జిల్లాలో చేపట్టినట్లు తెలిపారు. రూ.2214 కోట్లతో మూడు ప్యాకేజీల కింద జరుగుతున్న పనులు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి ఇటు నాగపూర్‌ హైవేకు, సూర్యాపేట, హైదరాబాద్‌కు, ఖమ్మం-కొరివి, ఖమ్మం-కోదాడ, ఖమ్మం-వరంగల్‌కు పలు జాతీయ రహదారులను అనుసంధానించినట్లు తెలిపారు. దాంతో ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కీలకంగా మారనుందన్నారు. ఖమ్మం-దేవరపల్లి, నాగపూర్‌-అమరావతి రోడ్లకు సర్వీస్‌ రోడ్లు మంజూరైతే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 04:08 AM