Kavitha Invited: హెచ్‌ఎంఎస్‌లోకి కవితకు ఆహ్వానం
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:37 AM
జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభ హెచ్‌ఎంఎస్ సింగరేణి గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికకు రంగం సిద్ధమైంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం..
త్వరలో సింగరేణి గౌరవాధ్యక్షురాలిగా నియామకం
ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం: రియాజ్ అహ్మద్
హైదరాబాద్, గోదావరిఖని, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎ్‌స) సింగరేణి గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికకు రంగం సిద్ధమైంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీకేఎస్) అధ్యక్షురాలిగా పదేళ్లకు పైగా ఉన్న కవితను ఇటీవల అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో సింగరేణి జాగృతి, హెచ్‌ఎంఎస్ కలిసి సింగరేణిలో పని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో కవితను గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎంఎ్‌స ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా సింగరేణి కార్మికుల కోసం కవిత చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఆమెను ఈ పదవికి ఎన్నుకోబోతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక జరుగనుందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News